అమ్మాయిల దుస్తులపై ప్రధాని కామెంట్లు.. పొట్టిబట్టల్లో యువతులు రేపర్ లేని కాండీ


రాజకీయ నేతలు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. అప్పుడప్పుడు ఏదో ఒకవిషయంపై నోరు జారుతుంటారు. ఇప్పుడు థాయ్ లాండ్ ప్రధాని ప్రయూత్ చానోచా కూడా యువతుల వస్త్రధారణపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. థాయ్ లాండ్ 'సాంగ్ క్రాన్' అనే పేరుతో జరుపుకునే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన అమ్మాయిల దుస్తుల గురించి మాట్లాడుతూ.. అంగసౌష్టవం బయటకు కనిపించేలా కురచ, బిగుతైన దుస్తులు ధరించవద్దని.. పొట్టిబట్టల్లో ధరిస్తే యువతులు రేపర్ లేని కాండీ(ఆచ్చాదన లేని చాక్లెట్)లా ఉంటారని వ్యాఖ్యానించారు.

 

సాధారణంగా ఆ వేడుకల్లో యువతే ఎక్కువ ఉత్సాహంగా రెయిన్ డాన్సులు చేస్తుంటారు. దీంతో వారిపై వేధింపులు ఎక్కువవుతాయి. అందుకే దేశ ఆచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలని థాయ్ లాండ్ సైనిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.