బ‌స్‌పాస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ

 

తెలంగాణ వ్యాప్తంగా అన్నిరకాల  ఆర్టీసీ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రూ. 1150 ఉన్న ఆర్డిన‌రీ పాస్ ధ‌ర రూ. 1400కు పెంపు, రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ. 1600, రూ. 1450 ఉన్న మెట్రో డీల‌క్స్ పాస్ రూ. 1800కు పెంచారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధ‌ర‌ల‌ను పెంచారు. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 

ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికే ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుందని ప్రజలు వాపోతున్నారు.  గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధ‌ర‌ల‌ను పెంచారు. సాధార‌ణ ఛార్జీల‌తో పాటు బ‌స్ పాస్ ఛార్జీలను పెంచ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై పురుష ప్ర‌యాణికులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. మ‌హిళ‌ల‌కు ఫ్రీ జ‌ర్నీ సౌక‌ర్యం క‌ల్పించి, మ‌గాళ్ల‌పై ఛార్జీల బాదుడు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu