రాజమహేంద్ర వరానికి మహానాడుతో పసుపుశోభ

వేదంలా ఘోషించే గోదావరి... అమర ధామంలా శోభిల్లే  రాజమహేంద్రి... శతాబ్దాల  చరితగల  సుందర  నగరం .. గత  వైభవ  దీప్తులతో  కమ్మని  కావ్యం.. అలాంటి రాజమహేంద్రవరం మహానగరం పసుపు శోభ సంతరించుకోనుంది. తెలుగుదేశం మరికొద్ది రోజుల్లో పసుపు కళ సంతరించుకోనుంది. మే 28 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి. అలాగే ఆ   మహానాయకుడి శత జయంతోత్సవ సంవత్సరం. 

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మహా పండగ అయిన మహానాడును రాజమండ్రిలో నిర్వహించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. దీంతో రాజమండ్రి వేదికగా  మహానాడు బహిరంగ సభకు పార్టీ అధిష్టానం కమిటీని  ఏర్పాటు చేయనుంది. 

 అలాగే ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సభలలో ఒకటి హైదరాబాద్ వేదికగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ 100 సభలు నిర్వహించాలని నిర్ణయించిన తెలుగుదేశం.. తెలుగురాష్టరాలలోని 42 నియోజకవర్గాల కేంద్రాలలోనూ ఒక్కో సభ నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 58 సభలో వివిధ నగరాలు, పట్టణాలలో నిర్వహిస్తుంది. వందో సభ మహానాడు సభతో ముగుస్తాయి.  

ఇక జగన్ ప్రభుత్వం అలంబిస్తున్న ప్రజా వ్యతికేర విధానాలపై టీడీపీ ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి  బలంగా తీసుకు వెళ్లింది. అలాగే ఈ సారి ఎన్నికల మేనిఫెస్టో విభిన్నంగా ఉండడమే కాకుండా, ప్రజలందరికీ చేరువ అయ్యే పథకాలతో రూపొందించే దిశగా ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ఆర్థిక అసమానతలు లేకుండా.. ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా పథకాల రూపకల్పన చేయాలని నిర్ణయించారు. 

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా .. ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సంసిద్దం చేసేందుకు టీడీపీ అధినాయకత్వం   ముందుకెళ్తోంది. ఇక ఎన్టీఆర్ శతజయంతి వేళ.. ఆయన పేరిట 100 రూపాయిల నాణాన్ని  విడుదల చేయనున్నట్లు కేంద్రం గెజిట్ విడుదల చేసింది.  మరోవైపు గతేడాది ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే తెలంగాణలో ఖమ్మం వేదికగా జరిగిన శంఖారావ సభ సైతం సూపర్ సక్సెస్ అయింది. ఆ క్రమంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఇక మార్చి 29న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.   తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వాటిలో 100 స్థానాలలో  ఇప్పటికిప్పుడు అభ్యర్థులను దింపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు...బీఆర్ఎస్, బీజేపీలలో కలవరం రేపాయి. 

ఇంకోవైపు ఏపీలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నలుగురు ఘన విజయం సాధించారు. దీంతో అధికార జగన్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా క్లియర్ కట్‌గా స్పష్టమైందని తేటతెల్లమైంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టి పాదయాత్ర ప్రభంజనంలో దూసుకుపోతోంది. ఇక తెలుగుదేశం మహానాడును రాజమండ్రిలో  నిర్వహించాలని నిర్ణయించడం వెనుక ఆ పార్టీ అధినేత చంద్రబాబు పకడ్బందీ వ్యూహం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలు కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే.    2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. దాంతో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలకుగాను.. 14 స్థానాలను టీడీపీ గెలుచుకోగా.. ఒక్క స్థానం నుంచి తెలుగుదేశంతో పొత్తులో ఉన్న బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 

అలాగే తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకుగాను.. 12 టీడీపీ, ఒకటి బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలోని మొత్తం అన్ని స్థానాలను  గెలుచుకునే వ్యూహంలో భాగంగానే మహానాడు ను గోదావరి ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారనే చర్చ సైతం ఊపందుకొంది.