విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు

తెలంగాణ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటిస్తే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు   హాలిడేస్‌ను డిక్లేర్ చేసిన విద్యాశాఖ. 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు ఎస్ఏ-2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.21 నుంచి 24వ తేదీ వరకు మూల్యాంకనం చేయనున్నారు.

వచ్చేనెల 25న పేరెంట్స్ మీట్ నిర్వహించి.. విద్యార్థుల మార్కులు వెల్లడిస్తారు. కాగా  వచ్చేనెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.