హీరోయిన్ అంజలి కి కోర్ట్ వార్నింగ్
posted on May 24, 2013 2:36PM

ప్రముఖ సినీ నటి అంజలి మీద చెన్నై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడు కళంజియం పరువు నష్టం కేసులో ఈ రోజు నటి అంజలి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఆమె హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు జూన్ 5న ఖచ్చితంగా హాజరుకావాలని సైదాపేట కోర్టు ఆదేశించింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. ఇంతకుముందు కూడా ఒకసారి అంజలి న్యాయస్థానానికి హాజరుకాలేదు. దర్శకుడు కళంజియం డబ్బుల కోసం తనను వేధించాడని అంజలి ఆరోపించింది. దాని మీద దర్శకుడు కళంజియం పరువునష్టం కేసు పెట్టారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో పిన్ని, దర్శకుడి మీద ఆరోపణలు చేసిన అంజలి ఐదు రోజులు అజ్ఞాతంలోకి వెళ్లి కలకలం రేపింది. తరువాత బయటకు వచ్చి యధావిధిగా షూటింగ్స్ లో పాల్గొంటుంది. అయితే కళంజియం మాత్రం అంజలిని వదలడం లేదు.