తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు
posted on Nov 5, 2014 8:26AM

తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర శాసనసభ సిద్ధమై౦ది. సమావేశాల నిర్వహణ నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా పోలీ సులు పలు రకాల నిషేధాజ్ఞలతో పాటు ఆంక్ష లు, పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశా రు. ఈ నేపథ్యంలో ఉదయం పదకొండు గంటలకు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి ఈ టెల రాజేందర్, శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి, వైద్య, విద్యాశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ తొలి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదిలా వు౦టే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సి ద్ధమయ్యాయి. ప్రధానంగా కరెంటు, రైతుల ఆత్మహత్యలతో పాటు పార్టీ ఫిరాయింపులు తదితర అంశాలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహారచన చేశాయి.