చంద్రబాబు కాదు..కేసిఆర్ వల్లే కష్టాలు

విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు కారణం అనడం సరికాదని టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ ఎస్ నేతలు కావలనే చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు కేటాయించారని, 42:58 నిష్పత్తిలో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు అప్పులు, ఆస్తులు పంచారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కు అడ్డుపడితే తెలంగాణకు 54శాతం విద్యుత్ ఎక్కడిదో చెప్పాలని టీ.సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల వరకు విద్యుత్ రాదంటూ కేసీఆర్ రైతులకు చెప్పడం దారుణమని అన్నారు. సీఎంగా తాను చేయాల్సిన పనులను కేసీఆర్ చేయడం మానేశారని ఆరోపించారు. సోలార్ విద్యుత్ కు కేంద్రం సహకరిస్తామన్నా, కేసీఆర్ చొరవ చూపడం లేదంటూ విమర్శించారు. హైదరాబాద్ లో భారీగా కరెంటు దొంగతనం జరుగుతోందని అన్నారు. విద్యుత్ శాఖలో విజిలెన్స్ విభాగాన్ని సీఎం నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ పొదుపుకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu