సభలో ఏ చర్చకైనా సిద్దం: హరీష్

తెలంగాణ ప్రయోజనాల కోసం జరిగే ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమన్నారని, ఇప్పుడు రూ.లక్ష కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని హరీష్ రావు వ్యాఖ్యనించారు. సభ ఎక్కువ సమయం జరిగేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రతి సభ్యుడు చర్చలో పాల్గొనేలా చూస్తామని అన్నారు. సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని హరీష్ రావు సూచించారు. కొన్ని పార్టీలు సీమాంధ్ర నాయకత్వంలో పని చేయడం బాధాకరమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu