2 లక్షల మందికి రెండుపూట్ల‌ భోజనం!

తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతి రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు.

శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేష్ కుమార్ తో కలసి టోలిచౌకి లోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ జి.హెచ్.యం.సి, 9 మున్సిపల్ కార్పొరేషన్లలలో 300 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనాన్ని అందిస్తున్నమని మరో 50 కేంద్రాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఉదయం 10.30 నుండి గంటన్నర పాటు , సాయంత్రం 5 గంటలకు మరోకసారి భోజనాన్ని అందించేలా వేళలు మార్చామని అన్నారు. ప్రతి రోజు దాదాపు 2 లక్షల మందికి భోజనం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువ సెంటర్లు పెంచటానికి సిద్దంగా ఉన్నామన్నారు.

ప్రతి సర్కిల్ లో ఒక ప్రత్యేక వాహాన్నాన్ని సిద్ధంగా రేడిమేడ్ కుకుడ్ పుడ్ ను అవసరం ఉన్న చోటకు వెంటనే అందిచేలా చర్యలు తీసకున్నమ్నారు. ఎక్కడైన భోజనం అవసరం ఉంటే జి.హెచ్.యం.సి కాల్ సెంటర్ నెం.21111111 కాల్ చేయాలని కోరారు. జి.హెచ్.యం.సి ఆప్ ద్వారా కూడా ఆహారాన్ని కోరవచ్చు అన్నారు.  అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం అందించే విషయమై మున్సిపల్ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్ లతో ప్రతి రోజు సమీక్షిస్తున్నామని తెలిపారు. 

భోజనం విషయమై ప్రభుత్వానికి తగు సహకారం అందించాలని అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సి.యస్ కోరారు. ఎక్కడైన సమస్య ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అన్నపూర్ణ క్యాంటిన్ ద్వారా భోజనం అందిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్వక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu