ఢిల్లీలో రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్.. దేనిపైనంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. గురువారం (జులై 24) రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లకార్జున్ ఖర్గే, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై పార్లమెంటులో లేవనెత్తాల్సిందిగా రేవంత్ ఈ సందర్భంగా రాహుల్, ఖర్గేలను కోరారు. అసలు బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకే ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులతో ఢిల్లీ పర్యటనకు వచ్చారు.

ఇలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం (జులై 24) సాయంత్రం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నారు. తెలంగాణలో కులగణన జరిగిన తీరు, అనుసరించిన విధానం వంటి అంశాలపై ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్  ఇవ్వనున్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్ అంశాలలో తెలంగాణ దేశానికే మోడల్ గా నిలుస్తుందని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ఇవే అంశాలపై రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం ప్రాథాన్యత సంతరించుకుంది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu