చెట్లకు పైసలు కాస్తాయా..?
posted on Feb 18, 2021 10:58AM
తెలంగాణ ఆర్భాటపు కార్యక్రమాలకు అడ్డాగా మారిందా..? సీఎం బర్త్ డే ఎంత ఘనంగా జరిగితే తెలంగాణ ప్రజలు ఘనంగా బతుకుతున్నట్టా..? తెలంగాణ వచ్చిన ఎనిమిది ఏళ్లలో తెలంగాణ ప్రజలు బతుకులు పచ్చగా ఉన్నాయా..? లేక పాలకుల బతుకుల పచ్చగున్నాయా..? ఇవీ ప్రతిపక్ష నేతల విమర్శలు.
ఇటీవలే బీజీపీ లో చేరిన విజయశాంతి కేసీయార్ పై సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఒక ఆర్భాటపు కార్యక్రమం చేపట్టారని అన్నారు.
గ్రామానికి వెయ్యి మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలిచ్చారని. పాపం గ్రామఅధికారులు మాత్రం గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదని అంటున్నారని ఎద్దేవా చేశారు.
మొక్కల రేటు, ట్రీ గార్డులు, కూలీ ఖర్చులు ఎలా అని వాళ్ళు బాధపడుతున్న వాళ్ళ గోడు పాలకులకు వినిపించడం లేదని రాములమ్మ ఫైర్ అయ్యారు. వేసవి కాలంలో నీళ్ళు లేక మొక్కలు బతక్కపోతే తమకు షోకాజులు పంపుతారని విజయశాంతి ఆవేదన చెందారు. ఇవేవీ సార్ కారుకు పట్టవని. సారుకు తమ కుటుంబం, తన ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలని. గతంలో వేల కోట్ల రూపాయలతో మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేసి చేతులెత్తేశారని. తర్వాత ఉద్యానవన శాఖ అధికారి ఒకరితో సీఎం గారి ఫౌంహౌస్ నివాసంలో కోట్లాది రూపాయల విలువైన పనులు చేయించారని ఆరోవణలు వెల్లువెత్తాయి. సమయానికి జీతాలందక ఆర్టీసీ ఉద్యోగులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు వేదనకు గురవుతున్నా... బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నా సర్కారు వారు నిర్లక్ష్యం చేస్తుందని.. ఈ అవినీతి, అసమర్థ, అబద్ధాల, విఫల ప్రభుత్వాన్నికి గుణపాఠం చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె సోషల్ మీడియా పోస్ట్ లో అన్నారు.