కాంగ్రెస్ ను దేవుడైనా కాపాడలేడు..

నూట యాభై ఏళ్లకు పైగా చరిత్ర కలిగి.. దాదాపుగా 70 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే నిజంగా జాలేస్తుంది. ప్రస్తుతం కేవలం కొన్ని చిన్న రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్న ఆ పార్టీ నేతల ధోరణి లో ఇప్పటికి ఎటువంటి మార్పు లేదు. తాజాగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ పుదుచ్చేరి పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే . దీంతో ఆయనకు తమ గోడు చెప్పుకుంటే సమస్యలు తీరతాయని ఒక మహిళ భావించింది. ఆమె తమ సమస్యలను రాహుల్ గాంధీకి చెప్పుకుంటూ బాధ పడింది. అయితే ఆమె తమిళంలో మాట్లాడటంతో రాహుల్ గాంధీకి ఏమి అర్థం కాలేదు. అయితే ఆ సమయంలో ఆమె మాటలను ట్రాన్స్ లేట్ చేయడం కోసం పుదుచ్చేరి సీఎం వీ నారాయణ స్వామి ముందుకొచ్చారు. "ఇక్కడ ఎవరూ మా గురించి పట్టించుకోవడం లేదు. ఇక్కడి సీఎంనే తీసుకోండి. తుఫాను వచ్చినప్పుడు కనీసం ఆయన మమ్మల్ని ఒక్కసారి కూడా పరామర్శించడానికి రాలేదు" అని ఆ మత్సకార మహిళ రాహుల్ కు చెప్పింది.

 

అయితే ఈ విషయాన్ని రాహుల్‌కు వివరించే క్రమంలో సీఎం నారాయణస్వామి.."తుఫాను వచ్చినప్పుడు నేను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రిలీఫ్ ఫండ్లు సరిగా అందేలా చూశా. ఆమె దాని గురించే మాట్లాడుతోంది" అంటూ ఏకంగా అబద్ధం ఆడేశారు. ఈ ఘటన పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి నేతలు ఉంటే ఇక కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వవైభవం సాధ్యమేనా.. అని కాంగ్రెస్ పార్టీ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు..

 

 

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu