తెలంగాణ బిల్లు తిరస్కరణ..వెనక్కి వెళ్ళదు

 

 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర విభజనపై ఎలాంటి ప్రభావం చూపదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ బిల్లుపై సభలో ఓటింగ్  జరగలేదని అన్నారు. తెలంగాణ బిల్లును సభకి అభిప్రాయం కోసమే పంపించాం కాని ఓటింగ్ కోసం కాదని అన్నారు. కేబినేట్ సమావేశం అనంతరం కేంద్రం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుందని అన్నారు. సవరణలపై కేబినేట్ చర్చించి సలహాలు వుంటే పొందుపరుస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు బిల్లును వ్యతిరేకించిన పార్టీలన్నీ ఒకప్పుడు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని గుర్తుచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu