కిరణ్ పంతం నెగ్గింది..తెలంగాణ బిల్లు తిరస్కరణ
posted on Jan 30, 2014 11:25AM

అసెంబ్లీలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్రపతి పంపించిన తెలంగాణ బిల్లును తిరస్కరించాలంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. మూజువాణి ఓటింగ్‌తో సీఎం ఇచ్చిన నోటీసును అసెంబ్లీ ఆమోదించింది. దాంతో తెలంగాణ బిల్లును అసెంబ్లీ తిరస్కరించినట్లయింది.
సభలో అందోళనల మధ్యే స్పీకర్ సీఎం తీర్మానంపై ఓటింగ్ చేపట్టారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పారు. సభలో 86 మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారని తెలిపారు. బిల్లుపై 9,076 సవరణలు వచ్చాయన్నారు. సభను నిరవధికంగా వాయిదా వేశారు. సీఎ౦ కిరణ్ సమైక్యాంధ్ర నినాదాలు చేసుకుంటూ సభ నుంచి బయటకు వచ్చారు.