తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీలు
posted on Jun 12, 2025 9:29PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.మొత్తం 33 మంది ఐఏఎస్ అధికారులను, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్‌గా దాసరి హరిచందన, . పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌ను నియమించింది.
గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా శశాంక్ గోయల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీగా జే శంకరయ్య, రిజిస్ట్రేషన్స్ అండ్స్ స్టాంప్స్ స్పెషల్ సెక్రెటరీగా రాజీవ్ గాంధీ హనుమంతును నియమించింది. సిద్దిపేట కలెక్టర్‌గా కే హైమావతి, సింగరేణి డైరెక్టర్‌గా పీ గౌతమ్‌ను నియమించింది.