తెలంగాణ చర్చ ప్రధానంగా ఆజాద్,బొత్స భేటీ
posted on Nov 11, 2011 11:51AM
న్యూఢిల్
లీ: తెలంగాణపై త్వరలో అధిష్టానం తన నిర్ణయాన్ని ప్రకటించడంతో పాటు పార్లమెంటు సమావేశాలలోగా కేంద్రం తరఫున ఓ ప్రకటన కూడా వెలువడే అవకాశమున్న నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. వారి మధ్య తెలంగాణ చర్చ ప్రధానంగా ఉండే అవకాశముంది.అలాగే బొత్స తాను పిసిసి పగ్గాలు చేపట్టినప్పటి నుండి పిసిసి, డిసిసిని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు.ఈ సారి ఎలాగైనా ప్రక్షాళన చేయాలని బొత్స గట్టిగా భావిస్తున్నారట. అందుకోసం ఢిల్లీ పెద్దలను ఒప్పించాలని కూడా ఆయన భావిస్తున్నారట. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితర కాంగ్రెసు వ్యతిరేక నేతలను తప్పించి తనకు అనుకూలురైన వారిని నియమించుకునేందుకు బొత్స తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.