జోక్యం చేసుకోం సుప్రీం

న్యూఢిల్లీ: తెలంగాణలో సకల జనుల సమ్మెపై వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్కు సుప్రీంకోర్టు సూచించింది. ఒక ప్రాంతానికి సంబంధించిన విషయంపై జోక్యం చేసుకోమని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో సమ్మెలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కాగా తెలంగాణలో కోర్టులు నడపటం లేదన్న పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆరువారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే తెలంగాణ ఇవ్వొద్దని కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన మరో పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించలేమని, అయితే తెలంగాణపై కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చని తెలిపింది. సమ్మె కాలంలో జరిగిన ఆస్తుల నష్టపరిహారానికి వేసిన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్, స్వామిగౌడ్, కోదండరామ్లకు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu