సాయిపల్లవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వేసవికి ఫుల్ మీల్స్ గ్యారంటీ
on Jan 2, 2026

-ఏంటి ఆ గుడ్ న్యూస్
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-వేసవిలో ఖాయం
సిల్వర్ స్క్రీన్ కి అందం, గౌరవాన్ని తెచ్చే అరుదైన సహజ నటీమణుల్లో 'సాయిపల్లవి'(Sai Pallavi)కూడా ఒకరు. అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించడమే నిజమైన అందమని కూడా నిరూపించింది. అందుకే సహజ సిద్దమైన అభిమాన ఘనాన్ని భారీ స్థాయిలోనే పొందింది. ప్రస్తుతం తన హవాని బాలీవుడ్ యవనిక పై కూడా చాటబోతు ప్రపంచ సినిమాకి ధీటుగా భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత హై బడ్జెట్ లో తెరకెక్కుతున్న 'రామాయణ'(Ramayana)లో సీతమ్మ తల్లిగా చేస్తుంది. తన ఖాతాలో ఉన్న మరో బాలీవుడ్ మూవీ 'మేరే రహో'(Mere Raho). ఇదే ఆమె తొలి బాలీవడ్ మూవీ కూడా.అగ్ర హీరో అమీర్ ఖాన్(Aamir Khan)నట వారసుడు జునైద్ ఖాన్(JUnaid Khan)హీరో.
షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా గత నవంబర్ 7 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని భారీ సినిమాల రాకతో రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీ వేసవికి వెండితెరని పలకరించబోతున్నట్టుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ అధికారకంగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారనే టాక్ కూడా బి టౌన్ లో వినపడుతుంది. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత సెల్యులాయిడ్ పై సాయి పల్లవి మ్యాజిక్ ని అభిమానులు 'మేరే రహో' ద్వారా చూడబోతున్నారు.
Also Read: సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు
మేరే రహో పక్కా లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. మరి ప్రేమ కథా చిత్రాల్లో సాయి పల్లవి ఎంత బాగా పెర్ ఫార్మ్ చేస్తుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీలో కూడా సాయి పల్లవి కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడే అవకాశం ఉంది. అమీర్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న మేరే రహో 2016 లో థాయ్ లాండ్ దేశంలో రిలీజైన 'వన్ డే' అనే మూవీకి రీమేక్. నిషా గా సాయి పల్లవి రోహన్ గా జునైద్ ఖాన్ కనిపించబోతున్నారు. శ్వేతా తివారి, అమ్రితా సింగ్ కీలకమైన క్యారక్టర్ లలో కనిపిస్తుండగా సునీల్ పాండే దర్శకుడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



