బ్రాహ్మణి స్టీల్ స్థానంలో సెయిల్
posted on Nov 11, 2011 12:03PM
హైదరాబా
ద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రమోట్ చేసిన బ్రాహ్మణి స్టీల్ స్థానంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ముందుకు వచ్చినట్లు ఎకనమిక్ టైమ్స్ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో కడప జిల్లాలో 4,430 కోట్ల రూపాయల వ్యయంతో 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో బ్రాహ్మణి ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాలనే ప్రాజెక్టు ప్రతిపాదనలు జరిగాయి. ఇది 2007లో జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం ఇనుప ఖనిజం గనులను, 14,700 ఎకరాల భూమిని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్‌కు నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయిన తర్వాత ఆ ప్రాజెక్టును నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోని ఉక్కు సంస్థలను సంప్రదించడం ప్రారంభించింది.