అహ్మదాబాద్-లండన్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య.. టేకాఫ్ కు ముందే గుర్తించడంతో తప్పిన ముప్పు

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI159 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే టేకాఫ్ కు ముందు ఈ సమస్యను గుర్తించడంతో పెను ముప్పు తప్పింది.  ఈనెల 12న అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియా విమానం ఆ రోట్లో నడపడానికి సిద్ధమైన తొలి ఫ్లైట్ ఇదే కావడం గమనార్హం. ఈ ఫ్లైట్ లో కూడా సాంకేతిక సమస్య తలెత్తడం ఆందోళన కలిగిస్తున్నది.  మొత్తంగా గత కొద్ది రోజులుగా ఎయిర్ ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల విమాన సర్వీసులలో ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu