చెవిరెడ్డి అరెస్టు?

వైసీపీ సీనియర్ నేత, మాజీ  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. 

వైసీపీ సీనియర్ నేత, మాజీ  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.  చెవిరెడ్డి బెంగళూరు విమానాశ్రయానికి వస్తున్నారన్న అత్యంత విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయనను అదుపులోనికి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడ తరలిస్తున్నారని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన  2024 ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  వైసీపీ హయాంలో   చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రభుత్వ విఫ్ గా కూడా పని చేశారు. అంతే కాకుండా తుడా చైర్మన్ గా కూడా ఉన్న ఆయన ఆ పదవిని అడ్డుపెట్టుకుని పలు అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే  ఏ వన్ గా   రాజ్ కసిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డి, ఈ ఆర్థిక వ్యవహారాలు చూసిన  బాలాజీ గోవిందప్పను  స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం  అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  ఈ కేసుతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఉన్న సంబంధాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దృష్టి సారించారు.

అందులో భాగంగా చెవిరెడ్డి గన్మెన్ మదన్ రెడ్డిని విచారణ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై సిట్ లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. దీనిపై ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో  మీడియాతో మాట్లాడుతూ తాను దేనికీ భయపడనని అన్నారు.  అటువంటి ఆయన అడ్డుకుంటారని తెలిసీ శ్రీలంకకు అంటూ బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరారీ కావడానికి ప్రయత్నించారా అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.