2018లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ కారణం : టీపీసీసీ చీఫ్
posted on Jun 17, 2025 3:06PM
.webp)
తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 400 నుండి 600 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఫోన్‌లను ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ సాక్షిగా సిట్ ముందు హాజరయ్యారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లారు. 2023లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌గౌడ్ ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆయన పలుమార్లు చెప్పారు. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ , గద్వాల జడ్పీ మాజీ చైర్‌పర్సన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సరిత హాజరయ్యారు.
సిట్ ఎదుట టీపీసీసీ చీఫ్ తన స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత మీడియా మందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా 600 మందిపైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయని పీసీసీ చీఫ్ తెలిపారు. దీనిపై తాము ఆనాడే ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని దీనిపై మాజీ సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణమని అన్నారు. మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని, కేసీఆర్ సిగ్గుతో తలవంచుకునే ఘటన అని. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ శిక్షార్హులు అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.