మహిళల అండర్ 19 వరల్డ్ కప్ విజేత టీమ్ ఇండియా

అండర్-19 మహిళా టి20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. సౌతాఫ్రికాలో జరిగిన తొలి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది.ఇంగ్లాండ్ తో ఆదివారం (జనవరి 29) జరిగిన ఫైనల్లో భారత అండర్-19 మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మహిళల క్రికెట్లో ఏ విభాగంలోనైనా భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం.  ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ఓవర్లలో 68 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లు సదు, అర్చన దేవి, పర్షవీ చోప్రా రెండేసి వికెట్లు తీయగా, మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ తలో వికెట్ తీశారు.  

అనంతరం లక్ష్యచేదనకు దిగిన టీమ్ ఇండియా 14 ఓవర్లలోనే మూడు వికెట్లకు కోల్పోయి 69 పరుగులు చేసి విజయన్నందుకుంది.  తెలుగమ్మాయి గొంగడి త్రిష 29 బంతుల్లో 24 పరుగులతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది.

సౌమ్యా తివారి 37 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను గెలుపుతీరాలకు చేర్చింది. మహిళల అండర్-19 విభాగంలో తొలిసారి నిర్వహించిన ఈ టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.