killerjbrands.com ..మద్యం మాఫియాపై పోరుకు ప్రత్యేక వెబ్‌సైట్
posted on Mar 26, 2022 4:31PM
మద్యం మాఫియాపై టీడీపీ పోరును మరింత ఉధృతం చేసింది. మద్యం మాఫియాపై ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించింది. www.killerjbrands.com పేరిట టీడీపీ వెబ్‌సైట్ ప్రారంభించింది. మద్యం పేరుతో దోపిడీ, మరణాల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచుతామని, డిజిటల్ క్యాంపెయిన్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
జగన్ రెడ్డి సాగిస్తున్న మద్యం మాఫియాను కూకటివేళ్లతో సహా పెకలించాలంటే టీడీపీ ఆవిష్కరించిన వెబ్ సైట్లో ప్రజల కూడా వారికి తెలిసిన మద్యం, నాటుసారా విక్రయాలు, వాటివల్ల చనిపోతున్న వారి వివరాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని టీడీపీ విజ్ఞప్తి చేసింది.
ప్రజల ప్రాణాలు హరిస్తూ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న మద్యం మాఫియా వల్ల జరిగే అనర్థాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వరకు టీడీపీ తరుపున పోరాటం చేస్తామని నేతలు స్పష్టం చేశారు.
మద్యంపై సామాజిక మాద్యమాల ద్వారా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. నాటుసారాను నిర్మూలించాలని, ప్రభుత్వ దుకాణాల్లో జె బ్రాండ్ మద్యం అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది.