టీడీపీకి బై..  వైసీపీకి సై..

ఏపీ పంచాయతీ పంచాయితీ ఎన్నికల్లో గెలిచినా అభ్యర్థులు ఉన్న పార్టీలను  విడిచి పక్క పార్టీలో చేరుతున్నారు .. బహుశా గ్రామా అభివృద్ధి అప్పుడే మొదలు పెట్టినట్లుఉన్నారు అభ్యర్థులు.. ఓ పార్టీ మద్దతుతో గెలిచిన నేతలు.. మరో పార్టీకి మారుతూ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారు అభ్యర్థులు. లీడర్ల కంటే మేము ఏం తక్కువ కామంటున్నారు గెలిచిన అభ్యర్థులు.. అంతేలెండి ఆవు చేలో మేస్తే, దూడ మాత్రం గట్టున మేస్తుందా.. నేతలు పార్టీ మారితే కానీ తప్పు మేము మారితే అవుతుందా అనుకుంటున్నారు కాబోలు.. 
  
ఇది ఇలా ఉండగా చిత్తూర్ జిల్లా బంగారుపాళ్యం నియోజక వర్గంలోని బొమ్మాయిపల్లెలో టీడీపీ మద్దతుతో గౌరమ్మ అనే అభ్యర్థి గెలిచారు. రాత్రికి రాత్రే ఆమె టీడీపీ పార్టీ కండువా వదిలి, వైఎస్ఆర్సీపీ నేత కుమార్ రాజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. అలాగే చిత్తూరు మండలంలోని చింతలకుంట పంచాయతీలో గెలిచిన గీతాంజలి కూడా వైఎస్ఆర్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమె కూడా టీడీపీ మద్దతుతోనే గెలిచారు. పూతలపట్టు మండలానికి చెందిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులూ వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల్లో చాలా చోట్ల అధికార పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద ఎక్కువైంది. చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు గెలవడంతో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. వైఎస్ ఆర్సీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీలోకి లాక్కుంటోందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.