టీఆర్ఎస్‌లోకి తీగల, సాయన్న అంటూ జగన్ మీడియా ప్రచారం
posted on Sep 29, 2014 11:54AM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కించుకోలేకపోయిన జగన్ పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలని ప్రయత్నిస్తోంది. పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం చేస్తోంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ ఆయన చేరుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అలాగే ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు... మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఇలా ప్రచారం చేస్తున్న జగన్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా వున్నారో లెక్కలు వేసుకోవడం మరచిపోయినట్టుంది.