చింతమనేని రిలీజ్..
posted on Feb 19, 2021 10:11AM
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. ఏలూరు రూరల్ స్టేషన్ నుండి చింతమనేని ని అర్ధరాత్రి పోలీసులు రిలీజ్ చేశారు. బి. సింగవరం కేసుకు సంబంధించి పోలీసులు చింతమనేనిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు చింతమనేని ని హాజరుపరిచారు. విచారణ జరిపిన జడ్జి 41సి నోటీసు ఇచ్చి చింతమనేనిని విడుదల చేయాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించారు. అనంతరం అర్థరాత్రి ఆయనను ఇంటి దగ్గర పోలీసులు వదిలిపెట్టారు.
చింతమనేని అరెస్ట్ తో బుధవారం హైడ్రామా నడిచింది. బి. సింగవరంలో చింతమనేని ప్రచారానికి వచ్చివెళ్లాకా ఇరువర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అందుకు చింతమనేని బాద్యుణ్ని చేస్తూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. టీడీపీ నేత అరెస్ట్ పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.చింతమనేని అరెస్టుపై పోలీసు ల తీరును తప్పు పట్టారు. చింతమనేని అరెస్ట్ సంచలనంగా మారగా, అర్ధరాత్రి అయన విడుదలతో ఉద్రిక్తత సద్దుమనిగింది.