టాస్క్ ఫోర్స్ పోలీసుల దారిదోపిడీ

ఖమ్మంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కంచే చేను మేసిన చందంగా వ్యవహరించారు. దోపిడీలను అరికట్టాల్సిన వారే.. దారిదోపిడీకి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.  ఖమ్మంలో రాజస్థాన్ కు చెందిన మిర్చి వ్యాపారి గమస్తా రూ. 10లక్షల నగదు తో రాత్రి సమయంలో వెళ్తుండగా టాస్క్ ఫోర్సు పోలీసులు అడ్డగించారు.  గంజాయి కేసులో ఇరికిస్తామంటూ బెదరించి ఆ వ్యాపారి వద్ద ఉన్న పది లక్షల రూపాయలలో ఆరు లక్షల రూపాయలు తీసేసుకున్నారు.

ఆ తరువాత అతడిని విషయం ఎవరికీ చెప్పవద్దని బెదరించి విడిచిపెట్టారు.  ఖమ్మంలో జరిగిన ఈ సంఘటనను రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన వ్యాపారి అసోసియేషన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అసోసియేషన్ నాయకులు విషయాన్ని ఖమ్మం పోలీసు కమిషనర్ తెలియజేశారు. దీనిపై విచారణ జరిపించిన కమిషనర్ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. మరో అధికారిని డీఐజీ ఆఫీసుకు సరెండర్ చేశారు. అలాగే వ్యాపారి గుమస్తా నుంచి పోలీసులు అపహరించిన ఆరు లక్షల రూపాయలను రికవర్ చేసి వ్యాపారికి అప్పగించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu