ఇన్ఫోసిస్ స్వాతిది పరువు హత్యా..?

గత నెలలో చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో హత్య చేయబడ్డ స్వాతిపై డీపీఐ ప్రధాన కార్యదర్శి తిరుమావళవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసు విచారణలో భాగంగా బన్రూటి కోర్టులో విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతి మతం మార్చుకుని ప్రేమలో పడిందని, ఆమెది పరువు హత్యని తిరుమావళవన్ ఆరోపించారు. రామ్ కుమార్ ఏకపక్ష ప్రేమ హత్యకు కారణం కాదని, రాష్ట్ర పోలీసులు ఎన్నో వాస్తవాలను దాచి పెట్టారని ఆయన అన్నారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, నిజాలు బయటకు రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని అన్నారు. రాష్ట్రంలో పరువు హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu