బీహార్‌లో మావోల ఘాతుకం..10 మంది జవాన్ల మృతి
posted on Jul 19, 2016 10:35AM
.jpg)
బీహార్‌లో మావోయిస్ట్‌లు రెచ్చిపోయారు. ఔరంగాబాద్, గయ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన దుమారిలో గల అటవీ ప్రాంతంలో కోబ్రా బెటాలియన్‌పై మావోలు ఈఐడీలను పేల్చడంతో 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి..ఈ కాల్పుల్లో నలుగురు మావోలు మరణించినట్లుగా తెలుస్తోంది. కొంతమంది జవాన్లు గాయపడ్డారు..వారిని తరలించేందుకు హెలికాఫ్టర్‌ను పంపినా మావోయిస్ట్‌లు కాల్పులు జరుపుతుండటంతో హెలికాఫ్టర్ తిరిగి పట్నా చేరుకుంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఘటనా స్థలం నుంచి సమాచారం అందడం లేదు. మావోలపై పోరు కోసం కేంద్రం 205వ కోబ్రా బెటాలియన్ జవాన్లను అక్కడ మోహరించారు.