భారీగా ‘స్వచ్ఛ కర్నూలు’ కార్యక్రమం

 

భారత ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీల వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ‘స్వచ్ఛ కర్నూలు’ పేరుతో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. దాదాపు రెండు లక్షల మంది కర్నూలు ప్రజలు రోడ్ల మీదకు వచ్చి 150 బృందాలుగా విడిపోయి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఇ కృష్ణమూర్తి కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగిందిగానీ, రెండు లక్షల మంది ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరగడం మాత్రం ఇదే ప్రథమం. ఈ విధంగా కర్నూలు నగరం తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu