ముసలాయన ముద్దు.. చివరికి జైలు...
posted on Oct 25, 2014 10:21AM
.jpg)
ము.. ము.. ముద్దంటే చేదా అంటారు.. అవును చేదేమరి... ఎందుకంటే, ముక్కు ముఖం తెలియని వాళ్ళ ముఖం మీద ముద్దుపెడితే అది చేదుగానే వుంటుంది. చేదైన ఫలితాలనే ఇస్తుంది. ఈ విషయాన్ని ఓ ముసలాయన ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాడు. అమెరికాలో నివసించే భారతీయుడైన దేవేందర్ సింగ్ అనే 62 సంవత్సరాల ముసలాయన హ్యూస్టన్ నుంచి నెవార్క్‌కి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆ విమానంలో తన పక్కనే కూర్చుని ప్రయాణిస్తున్న ఓ యువతి నిద్రపోతోంది. అటూ ఇటూ చూసిన దేవేందర్ సింగ్ ఆ నిద్రపోతున్న యువతికి లటుక్కున ముద్దు పెట్టేశాడు. ఆ మొరటు ముద్దు ధాటికి ఆ యువతి ఉలిక్కిపడి నిద్రలేచింది. ఈ ముసలాయన అక్కడితో ఆగితే పరిస్థితి ఎలా వుండేదోకానీ, అక్కడితో ఆగకుండా ఇంకాస్త అడ్వాన్స్ అవబోయాడు. దాంతో ఆ యువతి అరచి గీపెట్టి విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. చివరికి ఈ కేసు అమెరికాలోని నెవార్క్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి దేవేందర్ సింగ్‌కి ఎనిమిది నెలల కారాగార శిక్ష విధించారు.