కారుకి అడ్డొచ్చాడని డాక్టర్‌ని కాల్చి చంపాడు
posted on May 21, 2017 1:24PM

కారుకు అడ్డం వచ్చాడనే చిన్న కారణంతో ఏకంగా ఆ వ్యక్తి ప్రాణాలనే తీసేసిన ఘటన హర్యానాలో జరిగింది. వివరాల్లోకి వెళితే గుర్గావ్‌కి చెందిన మహావీర్ అనే డాక్టర్ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళుతున్నాడు. ఫరూక్ నగర్ వద్ద టర్న్ అవుతుండగా అటువైపు నుంచి వస్తున్న కారుని స్వల్పంగా ఢీకొంది. దీంతో మహావీర్‌తో కారు డ్రైవర్ వాగ్వివాదానికి దిగాడు. వీరిద్దరి గొడవ చూసి కారులో కూర్చొన్న డ్రైవర్ సోదరుడు ఆగ్రహంతో తన వద్ద ఉన్న తుపాకీతో మహావీర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలగా, డ్రైవర్‌కు బుల్లెట్ దిగింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన డ్రైవర్ సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.