కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు
posted on May 21, 2017 2:25PM
.jpg)
కర్నూలు జిల్లాలో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. వీరిద్దరూ కృష్ణగిరి సమీపంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా కాపు కాసిన ప్రత్యర్థులు వీరి వాహనంపైకి బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం కారు పంటపొలాల్లోకి దిగిపోవడంతో వాహనం దిగి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతున్న నారాయణ రెడ్డిని వేటకొడవళ్లతో నరికి చంపారు. ఆయనతో పాటు ప్రధాన అనుచరుడు సాంబశివుడిని కూడా చంపారు. నారాయణ రెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది.