అవయవం కోసి మంచి పనిచేశావ్..యువతికి సీఎం ప్రశంస

ఆత్యాచారం చేయబోయిన కామాంధుడి మర్మాంగాన్ని కోసేసిన కేరళ యువతిపై సోషల్ మీడియాలో అభినందనలు ముంచెత్తుతున్నాయి. ఈ జాబితాలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేరారు. ఆమె ఎంతో ధైర్యంగా మంచి పని చేసింది..అందులో ఎటువంటి అనుమానం లేదని సీఎం ప్రశంసించారు. కొల్లమ్‌లోని పన్మవ ఆశ్రమానికి చెందిన గణేశానంద తనను భక్తితో కొలుచుకుంటున్న కుటుంబానికి చెందిన యువతిపై ఎనిమిదేళ్లుగా ఆత్యాచారానికి పాల్పడుతున్నాడు. నిన్న కూడా ఆమెపై ఆఘాయిత్యం చేయబోగా..విసిగిపోయిన ఆ యువతి ఇక ఈ వేధింపులు భరించలేక అతని మర్మాంగాన్ని కోసేసింది..ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu