సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... అనుమానాస్పదంగా...

 

ప్రేమికుల రోజున ఒక జంట మధ్య జరిగిన గొడవ ఆ జంటలోని యువతి ఆత్మహత్యకు కారణమైంది. అయితే ఆమెది ఆత్మహత్యా, హత్యా అనే విషయం ఇంకా నిర్ధారణ కావలసి వుంది. హైదరబాద్‌లోని యాప్రాల్‌లో నివాసం ఉండే మాజీ సైనికుడు టి.సుదర్శన్ కుమార్తె సుప్రియ (23) మాదాపూర్, సైబర్ పెరల్‌లోని అసెంచర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఏడాదిన్నరగా పనిచేస్తోంది. అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే సాయికిరణ్ - సుప్రియ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో సాయికిరణ్ సుప్రియతో సన్నిహితంగా ఉండటం లేదు. దానికి కారణం తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 12 గంటలకు సుప్రియ సాయికిరణ్‌తో మాట్లాడాలంటూ ఆఫీసులోంచి బయటకి వెళ్ళింది. ఆ తర్వాత ఇద్దరూ ఆఫీసులోకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో ఆఫీసులోంచి బయటకి వెళ్ళింది. ఆ తర్వాత భవనం మీద నుంచి కింద పడింది. ఆమెను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించింది. సుప్రియ భవనం మీద నుంచి దూకిందా లేక సాయికిరణ్ తోసేశాడా అనే విషయం పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ప్రియుడు సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకొని, అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే సుప్రియకి - సాయికిరణ్‌కి గతంలో గొడవలు జరిగాయని, తమ కుమార్తెను సాయికిరణే చంపి వుంటాడని సుప్రియ తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu