పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కీలక ఆదేశాలు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం   వీలైనంత త్వరగా,  లేదా 3 నెలల్లో  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు

సీజేఐ గవాయ్. అదే సమయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ గవాయ్ ఆదేశించారు. కాగా, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే దానిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి. ఈ వాదనల అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అనర్హత పిటీషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu