పార్టీ ఫిరాయింపులపై సుప్రీం.. రెండు నెలలు ఆగండి..
posted on Dec 11, 2015 3:55PM

పార్టీ ఫిరాయింపులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్బంగా 14 నెలలవుతున్న పార్టీ ఫిరాయించిన వాళ్లపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. పార్టీ ఫిరాయింటిన వాళ్లపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు నెలలు పైన అయిపోతుంది.. కానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ తరుపు న్యాయవాది సుప్రీంకు తమ వాదనలు వినిపించారు. దీంతో సుప్రీం.. ఇది స్పీకర్ పరిధిలో ఉన్నందు వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేమని.. తమ పరిధిలో లేనందువల్ల విచారించలేమని తెలిపింది. అంతేకాదు రెండు నెలల లోపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే తాము పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.
అయితే ఇప్పుడు ఈ రెండు నెలల తరువాత తలసాని పరిస్థితి ఏంటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సుప్రీం కోర్టు రెండు నెలలు గడువు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ రెండు నెలల్లో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సుప్రీం యాక్షన్ తీసుకుంటుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికైనా స్పీకర్ గారు మేల్కొని ఎదో ఒక చర్య తీసుకుంటారో లేదో చూడాలి.