మేగజీన్ వివాదంలో ధోనికి సుప్రీంలో ఊరట..
posted on Sep 5, 2016 4:22PM
.jpg)
ఓ మేగజీన్ కవర్ పేజీపై శ్రీమహా విష్ణువు రూపంలో దర్శనమిచ్చిన టీమిండియా కెప్టెన్ ధోనిపై వచ్చిన విమర్శలు అన్ని ఇన్నీ కావు. ధోని హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ అనేక హిందూ సంస్థలు ధోనిపై దుమ్మెత్తిపోశాయి. ఈ వివాదం అక్కడితో ఆగిపోలేదు..ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కోర్టులో కేసు నమోదు కావడంతో న్యాయస్థానం ధోనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత అలాంటి కేసులోనే కర్ణాటక హైకోర్టు క్రిమినల్ కేసు దాఖలుకు ఆదేశాలు వెలువరించింది. అయితే ఈ వివాదంపై ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కెప్టెన్ కూల్ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కర్ణాటక హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. ఈ విషయంలో ఏ ఒక్కరి సెంటిమెంట్లకు ధోని భంగం కలిగించలేదని వ్యాఖ్యానించిన సుప్రీం ఈ కేసు విచారణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.