మంత్రిని బుక్‌చేసింది సెక్రటరీయే..?
posted on Sep 5, 2016 4:51PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల సీడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఇంత కలకలానికి కారణమైన సీడీలు బయటకు ఎలా వచ్చాయా అన్న దానిపై పోలీసులు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో సందీప్ కుమార్‌కు కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఈ సీడీనీ లీక్ చేసి చాలా మందికి పంచినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు సెక్రటేరియట్‌కు వెళ్లి ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సీడీలో మంత్రితో కలిసి ఉన్న మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేషన్ కార్డు కోసం వెళితే సందీప్ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి, తాను స్పృహ తప్పినపుడు అత్యాచారం చేశాడని తెలిపింది. ఢిల్లీ పోలీసులు సందీప్‌పై కేసు నమోదు చేసి కస్టడీకి అప్పగించారు.