సురక్షితంగా భూమికి చేరిన సునీతా విలియమ్స్

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు, బుచ్ విల్మోర్‌లు సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారు. ఎనిమిది రోజుల మిషన్‌ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్... దాదాపుగా తొమ్మిది నెలలుగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చిన ఏర్ప డిన సంగతి తెలిసిందే.

వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు విఫలమౌతూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు వారు బుధవారం (మార్చి 19) సురక్షితంగా భూమికి వచ్చారు.  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వారిని తీసుకువచ్చిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.28 గంటలకు ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

దీంతో ప్రపంచవ్యాప్తంగా గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించనున్నారు. నాసా రూల్స్ ప్రకారం వారికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇన్నాళ్లు ఐఎస్‌ఎస్‌లో జీరో గ్రావిటీలో గడిపిన ఈ వ్యోమగాములు ఇప్పుడు ఇక్కడ భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు కావడానికి కొంత కాలం పడుతుందంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu