స్పీకర్ అయ్యన్నపాత్రుడి టీమ్ జయకేతనం!
posted on Mar 19, 2025 9:48AM

శాసనసభ్యులకు నిర్వహించిన ప్రత్యేక క్రీడా పోటీల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వాలీబాల్ పోటీలో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌లో అయ్యన్న పాత్రుడి నేతృత్వంలోని స్పీకర్ టీం విజయం సాధించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడి జట్టు హోంమినిస్టర్ జట్టుపై ఐదు పాయింట్ల ఆధిక్యతతో గెలుపొందింది. స్పీకర్ టీం పాతిక పాయిట్లు సాధించగా, హోంమినిస్టర్ టీమ్ కేవలం 20 పాయిట్లు మాత్రమే సాధించగలిగింది.
విశేషమేమిటంటే ఈ మ్యాచ్ లో అయ్యన్నపాత్రుడు చురుకుగా, ఉత్సాహంగా ఆడి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. గతంలో వాలీబాల్ ప్లేయర్ గా మంచి గుర్తింపు ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మ్యాచ్ లో తన అనుభవాన్ని అంతా రంగరించి ఆడారు. మ్యాచ్ లో తన జట్టుకు విజయాన్ని అందించిన స్పీకర్ అయ్యన్ప పాత్రుడిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు.