ఏపీని మరోసారి మోసం చేసిన కేంద్రం

 

అసలే ప్రత్యేకహోదా ఇవ్వలేదని కేంద్రం మీద ఏపీ ప్రజలు మండిపడుతుంటే, కూల్ చేయాల్సిన కేంద్రం పెట్రోల్ పోసి ఇంకాస్త మంట పెంచుతుంది.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం మాట మార్చింది.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్నట్టు సుప్రీమ్ కోర్ట్ కి అఫిడవిట్ ఇచ్చింది.. మెకాన్ సర్వే కడప ఉక్కు ఫ్యాక్టరీ కి అనుకూలంగా నివేదిక ఇచ్చినా, కేంద్రం వైఖరి మారలేదు.. దీంతో ఏపీ ప్రజలు, నాయకులు కేంద్రం మీద మండిపడుతున్నారు.. ఇదే విషయం మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు.. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం మరోసారి మోసం చేసిందని విమర్శించారు..మెకాన్ సర్వేలో ఉక్కు ఫ్యాక్టరీపై సానుకూలత వ్యక్తమైనా.. అఫిడవిట్ ద్వారా కేంద్రం దుర్బుద్ధిని చూపించిందని ఆయన మండిపడ్డారు..మోడీకి, అమిత్ షాకి మన రాష్ట్రం పట్ల ప్రేమలేదని తేలిపోయిందని కేశినేని నాని అన్నారు.. కడప ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం వైఖరి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.. అలానే కేంద్రం వైఖరికి వ్యతిరేకిస్తూ కడపలో అన్ని పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.. మరి ఈ విమర్శలు, నిరసనల వేడి తాకి కేంద్రం కరుగుతుందో లేదో చూడాలి.