విభజనకు ఓకె, యూటి చేయండి
posted on Nov 18, 2013 7:09AM
.jpg)
రాష్ట్ర విభజన నేపధ్యంలో ఇన్నాళ్లు సమైక్యవాదం బలంగా వినిపించినట్టు కనిపించిన సీమాంద్ర కేంద్ర మంత్రులు ఇప్పుడు పూర్తిగా తమ మాట మార్చారు. ఇక సమైక్య రాష్ట్రం కష్టం అని భావించిన మంత్రులు ఇక ప్యాకేజీల మీద దృష్టి సారించారు. ప్రధానంగా హైదరాబాద్, సాగునీటి వనరుల పంపకం, నూతన రాజధాని అభివృద్ధికి తగిన ఆర్థిక ప్యాకేజీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలను.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ముందు ఉంచాలని భావిస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో సీమాంద్రుల్లో నెలకొన్న భయాందోళనలను కేంద్ర నివృత్తి చేయాలని మంత్రులు నివేదించనున్నారు. హెచ్‌ఎండీఎ పరిధి మేరకు హైదరాబాద్‌ను ఢిల్లీ పుదుచ్చేరి లా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని, అలా అయితే విభజనకు సీమాంద్రునలు ఒప్పిస్తామని జీవోయంకు నివేదించే ఆలొచనలో ఉన్నారు.
సోమావారం జీవోయం ఎదుట కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే జీవోయం ముందుంచవలసి అంశాలపై చర్చించిన కేంద్ర మంత్రులు సోమావారం ఉదయం మరోసారి పళ్లం రాజు నివాసోం సమావేశం అయి చర్చించనున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులతో పాటు అందుబాటులో ఉన్న రాష్ట్ర నాయకులు కూడా హాజరు కానున్నారు.