పుష్ప సినీమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట..మహిళ మృతి
posted on Dec 5, 2024 7:27AM
సినీమా పిచ్చి ఓ మహిళ ఉసురు తీసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా కోసం దిల్ షుక్ నగర్ నుంచి తన పిల్లలతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తున్నథియేటర్ కు వచ్చిన రేవతి అనే మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వివరాలిలా ఉన్నాయి.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలు బుధవారం రాత్రి ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ప్రేక్షకులకు అభివాదం చేయడానికీ అల్లు అర్జున్ కూడా ఆ సమయంలో ఆ థియోటర్ వద్దకు వచ్చారు. దీంతో అల్లు అర్జున్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. రేవతి మరణించగా ఆమె కుమారుడు కిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.