శ్రీశైలం జలాశయానికి వరద పోటు

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జూరాల జలాశయం  జలకళతో  కళకళలాడుతోంది. ప్రస్తుతం జూరాల జలాశయం నుంచి,  38 వేల 408 క్యూసెక్కుల నీరు వస్తున్నది.

ఇక సుంకేశుల నుంచి అయితే 36 వేల 975 క్యూసెక్కుల నీరు వస్తున్నది.శ్రీశైలం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 75 వేల 383 క్యూసెక్కులు ఉండగా, ఐట్ ఫ్లో లక్షా 21 వేల 482 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.50 అడుగులు ఉంది. కుడిచ ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu