శ్రీధర్ బాబు రాజీనామా..!!

 

 

 

మంత్రి శ్రీధర్‌బాబుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విసిరిన 'బౌన్సర్'కు తెలంగాణ నేతల నుంచి తీవ్రస్థాయిలో కౌంటర్ ఎదురవుతోంది. తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖను తప్పించినందుకు నిరసనగా... పౌరసరఫరాల శాఖనూ వదులుకోవాలని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్‌ కు రాజీనామా లేఖను సమర్పించబోతున్నట్లు తనతోటి మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్‌రెడ్డి తదితరులకు తెలియజేశారు.


తన రాజీనామాపై శ్రీధర్ బాబు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌ తో చర్చించారు. శాసనసభ వ్యవహారాల శాఖను తప్పించడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆయనకు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖను తీసుకునేది లేదని... పైగా, పౌర సరఫరాల శాఖ మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని వివరించారు.     

Online Jyotish
Tone Academy
KidsOne Telugu