క్ష‌మించ‌మ్మా..!

అవాంత‌రాలు చెప్పిరావు, వ‌చ్చివెళ్లిన త‌ర్వాత గాని ప్ర‌భావం తెలీదు. ఎతిక్ అనే పెద్దామె ఇండోనే షియా మ‌లాంగ్న‌గ‌రం సైఫాల్అన్వ‌ర్ ఆస్ప‌త్రిలో నేల‌మీద దిగులుగా కూచునుంది. క‌న్నీళ్లింకిన క‌ళ్లు ఐసియూనే చూస్తున్నాయి. లోప‌ల ఆమె ఏకైక కుమార్తె 21ఏళ్ల డ‌యాన్ పుష్పిత చావుబ‌తుకుల మ‌ధ్య ఉంది. డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ చేస్తున్నారు.  కూతురు కోరిన కోరిక‌ను కాద‌న‌లేక ఆ రోజు ఫుట్‌బాల్ మ్యాచ్‌చూడ్డానికి పిల్ల స్నేహితురాలితో పంపింది. మృత్యువే పిలిచిన‌ట్ట‌యిందని బావురుమంటోంది పుడు. అస‌లా తొక్కిస‌లాట దృశ్యం టీవీలో చూస్తేనే  దాదాపు ప్రాణం పోయినంత అయింది.  పోలీసులు టియ‌ర్‌గ్యాస్ వ‌ల్ల క‌నీసం ఊపిరాడుతోంది పిల్ల‌కి.. అంటూ రోదిస్తోంది.  ఆ సంఘ‌ట‌న జ‌ర‌గ‌గానే ఆమె స్నేహితురాలి ద‌గ్గ‌ర నుంచి ఫోన్ వ‌స్తే ఆస్ప‌త్రికి చేరుకుంది ఎతిక్‌. 

క్రీడాచ‌రిత్ర‌లో భ‌విష్య‌త్తులో ఏ త‌ర‌మూ మ‌ర్చిపోలేని ఘోరం జ‌రిగిపోయింది. అభిమానుల ఉన్మాద‌మే ఇంత‌మంది చావుకు కార‌ణ‌మైంద‌ని అంటున్నారు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌వారు. ఆట ఆట లానే చూడాలి, ఆట‌ను ఉన్మాదంతో చూస్తే ఇలానే ఫ‌లితం ఉంటుంది మ‌రి. తొక్కిస‌లాట‌లో చ‌ని పోయిం ది 125 మంది, గాయ‌ప‌డింది 300 మంది. కానీ మ‌ర‌ణిస్తున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. ఎంద‌రో త‌మ పిల్లల్ని, బంధువుల్నీ, స్నేహితుల్నీ పోగొట్టుకుంటున్నారు. త‌న కూతురికి భుజం ఎముక విరిగిం దిట‌, మొహం వాచిపోయింది, చెవి అంచు చీలి ర‌క్తం వ‌ర‌ద‌లైందిట‌! ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 12 గంట‌లపాటు ఆస్ప‌త్రిలో ఆ పెద్దామె అలా ప‌డుంది. తిండి లేదు, క‌ళ్లు మూత‌లు ప‌డ‌టం లేదు, దాహమూ లేదు.. పిల్ల బ‌తికి బ‌య‌ట‌ప‌డితే బాగుండ‌న‌ని ఐసీయూ త‌లుపుల‌కే క‌ళ్ల‌ప్ప‌గించింది ఎతిక్‌.

పోలీసులు నేరుగా జ‌నాల‌మీద‌కే గురిపెట్టి టియ‌ర్ గ్యాస్ షెల్స్ కొట్ట‌డంతో ఆ పొగ లో ఎవ‌రు ఎక్క‌డు న్నారో కూడా తెలీకుండా పోయింద‌ని, ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఖంగారుగా ప‌రిగెట్ట‌డంలో ఇద్ద‌రం అనేక‌ మందిని దాటుకుంటూ రావ‌డంలో నేను చాలాసార్లు కింద‌ప‌డ్డాన‌ని, కొంద‌రు కాళ్లూ చేతుల మీద తొక్కు కుంటూ వెళ్లార‌ని అయినా నా స్నేహితురాలిని వీడ‌కుండా బ‌య‌టికి లాక్కురాగ‌లిగాన‌ని ఎతిక్ కుమార్తె ఫ్రెండ్  అప్ప‌టి సంఘ‌ట‌న వివ‌రిస్తూంటే ప్రాణంతో ఈ ఇద్ద‌రూ ఎలా బ‌య‌ట‌ప‌డినందుకు వేయి దేవేళ్ల‌ కు మొక్కు కున్నారు డాక్ట‌ర్లు, న‌ర్సులూ, ఎతిక్‌తో పాటు! 

ఆప‌రేష‌న్ త‌ర్వాత ఎతిక్ త‌న కుమార్తెను చూడ్డానికి డాక్ట‌ర్లు అంగీక‌రించారు. పిల్ల‌కు మాట రావ‌డం లేదు. చేయి మెల్ల‌గా క‌దిలిస్తూ పెద్దామె క‌న్నీళ్లు తుడిచింది.. క్ష‌మించ‌మ్మా... ఇంకెప్పుడూ ఎక్క‌డికీ వెళ్ల‌ను.. మొండికేయ‌ను.. అంది!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu