సీమాంధ్రులను తెగ తిట్టినోళ్ళు మటాష్...
posted on May 17, 2014 12:14PM
.jpg)
టీఆర్ఎస్ వాళ్ళు సీమాంధ్రులను తిట్టారంటే అది వాళ్ళ ఉద్యమ వ్యూహంలో భాగంలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సీమాంధ్రులను అవమానకరంగా అనేకసార్లు మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన సీమాంధ్రులను దారుణంగా అవమానించడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీలు పడ్డారు. కేంద్ర మంత్రులుగా, ఎంపీలుగా పనిచేస్తున్న వారు కూడా తమ స్థాయి మరిచి సీమాంధ్రులను అవమానించారు. అలాంటి వాళ్ళందరూ ఈ ఎన్నికలలో మటాషైపోవడం సీమాంధ్రులకు చాలా సంతోషం కలిగిస్తున్న అంశం. సీమాంధ్రులు ఎంతగానో గౌరవించే జైపాల్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోవాలని కోరిక పుట్టి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి తెలంగాణ ఇచ్చేయాలంటూ కాంగ్రెస్ నాయకత్వ మీద ఒత్తిడి తెచ్చారు. చివరికి ఆయనే ఈ ఎన్నికలలో తుక్కుతుక్కుగా ఓడిపోయారు. మల్కాజిగిరిలో ఓడిపోయిన సర్వే సత్యనారాయణ, కేంద్ర మంత్రిగా వున్న బలరాం నాయక్, ఎంపీ మధు యాష్కి, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎంపీ రాజయ్య.. ఇలాంటి వాళ్ళందరూ తెలంగాణని అడ్డం పెట్టుకుని సీమాంధ్రులను తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు.. ఇప్పుడు వీళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడు సీమాంధ్రుల కళ్ళు కొంత చల్లబడ్డాయి.