కాంగ్రెస్‌కి తెలుగోడి ఉసురు తగిలింది

 

కాంగ్రెస్ పార్టీకి తెలుగోడి ఉసురు తగిలింది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి, ఢిల్లీలో తెలుగోడిని పిచ్చోడిని చేసి ఆడించిన కాంగ్రెస్ పార్టీ తెలుగోడి ఉసురు తగిలి సర్వనాశనమైపోయింది. గత ఎన్నికలలో అత్యధిక పార్లమెంట్ సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తెలుగోడు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవాలని కోరుకున్నాడు. తెలుగోడు కోరుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సర్వనాశనం అయిపోయింది. ప్రాంతాలు వేరైనా అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో తెలుగువాడు కాంగ్రెస్ పార్టీ అంతు చూశాడు. తెలంగాణ ఇచ్చాం అని చంకలు గుద్దుకున్నా, సీమాంధ్రని బాగుచేసేస్తాం అని మొసలి కన్నీరు కార్చినా కాంగ్రెస్ పార్టీని తెలుగోడు క్షమించలేదు. తన కడుపు మంటని ఓటు కాగడాగా మార్చి కాంగ్రెస్ పార్టీ చితికి నిప్పంటించాడు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఓడిపోయినా బుద్ధి తెచ్చుకోకుండా అయిదేళ్ళ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సొల్లు కబుర్లు చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళ ఆశలు నిరాశగా మార్చడానికి తెలుగువాడు ఎప్పుడూ సిద్ధంగా వుంటాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనే మాట తెలుగు రాష్ట్రాల్లో వినిపించకుండా వుండటానికి కృతనిశ్చయుడై వున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu